కశ్మీర్‌లో జవాను మృతి.. ఇద్దరు ఉగ్రవాదులు హతం..

Tue,June 18, 2019 10:58 AM

2 militants killed in Anantnag gunfight

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో ఇవాళ ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంత్‌నాగ్‌ జిల్లాలోని మహర్మ గ్రామంలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా బలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో అక్కడ బలగాలు కూంబింగ్‌ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు బలగాలకు తారసపడడంతో తెల్లవారుజామున 4 గంటలకు ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరూ సమీప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. మరో ఉగ్రవాది అక్కడున్న భవనంలో తలదాచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ ఉగ్రవాది కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక హతమైన ఉగ్రవాదులను జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఇద్ద‌రు జైషే ఉగ్ర‌వాదుల‌ను స‌జ్జ‌ద్ మ‌ఖ్బూల్ భ‌ట్‌, తౌసీఫ్‌లుగా గుర్తించారు. ఫిబ్ర‌వ‌రి 14న జ‌రిగిన పుల్వామా దాడిలో వీరి పాత్ర ఉన్న‌ట్లు అనుమానిస్తున్నారు. నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ మేజర్‌ కేతన్‌ శర్మ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

904
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles