ఆర్జేడీ నాయకులపై కాల్పులు

Fri,June 14, 2019 10:26 AM

2 local RJD leaders shot at in Muzaffarpur in Bihar

పాట్నా : బీహార్‌ ముజఫర్‌పూర్‌ జిల్లాలోని కంతిలో దారుణం జరిగింది. రాష్ట్రీయ జనతా దళ్‌(ఆర్జేడీ) పార్టీకి చెందిన ఇద్దరు నాయకులపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కాల్పులకు గురైన ఇద్దరు నాయకులను సమీప ఆస్పత్రికి తరలించారు. బాధిత నాయకులను సురేంద్ర యాదవ్‌, ఉమాశంకర్‌ ప్రసాద్‌గా పోలీసులు గుర్తించారు. ఒకరికి రెండు బుల్లెట్‌ గాయాలు కాగా, మరొకరికి నాలుగు బుల్లెట్‌ గాయాలయ్యాయి. వీరి శరీరం నుంచి బుల్లెట్లను తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ఆర్జేడీ నాయకులిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు డాక్టర్లు. కాల్పులకు గల కారణాలపై పోలీసులు దృష్టి పెట్టారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

881
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles