ఎర్రకోట వద్ద ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్

Fri,September 7, 2018 04:34 PM

2 ISIS Terrorists Arrested Near Delhi Red Fort Says Police

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇద్దరు ఉగ్రవాదులు కశ్మీర్ నుంచి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. గురువారం రాత్రి ఎర్రకోట సమీపంలోని బస్టాపులో ఉండగా ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల నుంచి అధునాతన ఆయుధాలు, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పిస్తోల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో ఇంజినీరింగ్ చదువుతున్న ఈ ఇద్దరిని పర్వేజ్, జమ్‌షేద్‌గా గుర్తించారు. వీరి స్వస్థలం జమ్ముకశ్మీర్‌లోని సోపియాన్ జిల్లా.

1556
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles