డ్యాంలో మత్స్యకారులు..కాపాడిన రెస్య్కూ టీం..వీడియో

Tue,August 20, 2019 02:35 PM

2 fishermen rescued from Kerwa Dam by bhopal Municipal Corporation team


భోపాల్ : మధ్యప్రదేశ్ లోని కేర్వా డ్యాంలో ఇద్దరు మత్స్యకారులు చిక్కుకున్నారు. భోపాల్ లో ఉన్న కేర్వా డ్యాం నీటిమట్టం పెరగడంతో అధికారులు డ్యాం గేట్లను తెరిచారు. దీంతో ఒక్కసారిగా డ్యాం కింది వైపు నీటి ఉధృతి పెరిగింది. డ్యాం కింది వైపున్న ఇద్దరు మత్స్యకారులు నీటిలో చిక్కుకున్నారు. సమాచారమందుకున్న మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మత్స్యకారులకు సేఫ్టీ జాకెట్లు అందించి..తాడు కట్టి ఇనుప నిచ్చెన సాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

1720
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles