బెంగాల్‌లో నాటు బాంబు పేలి ఇద్దరు మృతి

Tue,June 11, 2019 10:41 AM

2 Dead In Bomb Attack In Bengal Kankinara

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ నార్త్‌ 24 పరగణ జిల్లాలోని కంకినారలో నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఎండీ ముక్తర్‌(68) తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి ముందు కూర్చున్నాడు. ఈ సమయంలో గుర్తు తెలియని దుండగులు ముక్తర్‌ నివాసం ముందు నాటు బాంబులు విసిరారు. దీంతో ఆ బాంబులు పేలడంతో ముక్తర్‌ ప్రాణాలు కోల్పోగా, ఆయన భార్యతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాంబు దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. కంకినారలో పోలీసులు భారీగా మోహరించారు. బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికలప్పటి నుంచి హింసాత్మక వాతావరణం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

514
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles