పట్టాలు తప్పిన వాస్కోడిగామా పట్నా ఎక్స్‌ప్రెస్Fri,November 24, 2017 06:37 AM
పట్టాలు తప్పిన వాస్కోడిగామా పట్నా ఎక్స్‌ప్రెస్

ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చిత్రకూట్ జిల్లా మణిక్‌పూర్ వద్ద ఉదయం 4:18 గంటలకు రైలు పట్టాలు తప్పింది. వాస్కోడిగామా పట్నా ఎక్స్‌ప్రెస్ రైలు 13 బోగీలు పట్టాలు పక్కకు ఒరిగాయి. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది, స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వివరాల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశామని రైల్వే పీఆర్‌వో అనిల్ సక్సేనా తెలిపారు.

1567
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS