కూలిన బ్రిడ్జి : ఇద్దరు మృతి

Fri,December 28, 2018 12:33 PM

2 dead after bridge collapses in Garhi Cantonment in Dehradun

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని గర్హి కంటోన్మెంట్ పరిధిలో ఓ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ట్రక్కు వెళ్తున్న సమయంలోనే బ్రిడ్జి కూలిపోవడంతో.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

గురువారం రాత్రి బనాలి(ఉత్తరాఖండ్) గ్రామం వద్ద జరిగిన మరో ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. దట్టమైన పొగమంచు ఉండడంతో రహదారి సరిగా కనిపించలేదు. దీంతో అదుపుతప్పిన బోలేరో వాహనం లోయలో పడిపోయింది. మృతులంతా ఎలక్ట్రిసిటీ ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు.

879
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles