ఇద్దరు పిల్లలుంటేనే ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు..

Tue,October 22, 2019 04:29 PM

అస్సాం: ఎవరైతే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం కలిగి ఉంటారో వారు ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు కారనీ అస్సాం పరిశ్రమల శాఖామంత్రి చంద్రమోహన్‌ పట్వారీ అన్నారు. ఒక్కరు లేదా ఇద్దరు సంతానం కలిగి ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలనీ, వారు మాత్రమే ఉద్యోగానికి అర్హులని మంత్రి తెలిపారు. అక్టోబర్‌ 21న జరిగిన కేబినెట్‌ సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని ఆయన తెలిపారు. ఇద్దరు కంటే ఎక్కువ సంతానం కలిగిన వారు కనీసం ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు కూడా చేసుకోవడానికి వీల్లేదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ విధానం జనవరి 1, 2021 నుంచి అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు.1814
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles