మైనర్ పై అత్యాచారం, హత్య..ఇద్దరు అరెస్ట్

Sun,December 16, 2018 03:05 PM

2 arrested in minor gangrape, murder case

ముజఫర్ నగర్ : పదిహేనేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి..ఆపై హత్య చేసిన ఘటనలో యూపీ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో కుల్ దీప్, మాలతిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులిద్దరూ బాధిత బాలికను మే నెలలో పుర్కాజీ బ్లాక్ పరిధిలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఆరుగురు వ్యక్తులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి..హత్య చేసి బాలిక ఇంటికి సమీపంలో పడేసి వెళ్లిపోయారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేయగా..తాజాగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎనిమిది మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, మిగిలిన నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీస్ అధికారి ఒకరుత తెలిపారు.

4376
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles