ట్రాఫిక్ పోలీస్‌తో దురుసు ప్రవర్తన..

Sun,April 7, 2019 02:37 PM

2 arrested for misbehaving with Traffic police in delhi


న్యూఢిల్లీ: ఇద్దరు వ్యక్తులు ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించడమే కాకుండా..ట్రాఫిక్ పోలీసుపై దురుసుగా ప్రవర్తించారు. ఢిల్లీలోని బెర్ సరాయ్ ప్రాంతంలో ఏప్రిల్ 5న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు హెల్మెట్ పెట్టుకోకుండా తన స్నేహితురాలిని బైకుపై ఎక్కించుకుని వెళ్తుండగా..మార్గమధ్యలో పోలీసులు బైకును ఆపేశారు. హెల్మెట్ లేకపోవడంతో జరిమానా విధించేందుకు చలాన్ మిషన్ తీశాడు ట్రాఫిక్ పోలీస్. అయితే అమ్మాయి పోలీస్ చేతిలో ఉన్న మిషన్ కింద పడేయగా..యువకుడు ట్రాఫిక్ పోలీస్ చొక్కా చించేసి..హల్‌చల్ చేశారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడమే కాకుండా..విధుల్లో ఉన్న పోలీస్ అధికారిపై దురుసుగా ప్రవర్తించిన ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 186, 353, 34 కింద కేసు నమోదు చేశారు.

2402
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles