19 ఏండ్ల కుర్రాడు.. డ్రైవర్ అక్కర్లేని ట్రాక్టర్‌ను రూపొందించాడు!

Fri,December 8, 2017 08:03 PM

19 year old boy invents driverless tractor in rajashtan

ఆ కుర్రాడి వయసు పందొమ్మిదే. ఇప్పుడిప్పుడే మూతి మీద మీసాలు మొలుస్తున్నాయి. కాని.. తన మెదడుకు పదును పెట్టి కొత్త ఆలోచనతో డ్రైవర్ అక్కర్లేని ట్రాక్టర్‌ను కనిపెట్టాడు. దీంతో ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. రాజస్థాన్‌లోని బరన్ జిల్లా బమొరికాల గ్రామానికి చెందిన యోగేశ్ తండ్రి రామ్‌బాబు వ్యవసాయం చేస్తుంటాడు. పొలం దున్నడానికి ఆయన ట్రాక్టర్‌ను వాడేవాడు. అయితే.. చాలా ఏండ్ల నుంచి పొలం దున్నడానికి ట్రాక్టర్‌ను వాడటం వల్ల ఆయనకు బ్యాక్ పెయిన్ రావడం మొదలైంది. దీంతో ట్రాక్టర్‌ను నడపలేకపోతున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న కొడుకు యోగేశ్.. ఎలాగైనా దీనికి ఓ పరిష్కార మార్గం కనిపెట్టాలనుకున్నాడు. దీంతో యోగేశ్ కు ఓ ఐడియా వచ్చింది. ఎవరి సహాయం లేకుండా ట్రాక్టర్‌ను దాని కదే నడిపేలా చేస్తే బెస్ట్ కదా అని అనుకున్నాడు. ఆ ఐడియా మీద వర్క్ చేయడం ప్రారంభించాడు. అలా.. ఆ ట్రాక్టర్‌కు ఓ రిమోట్ తయారు చేశాడు. ఆ రిమోట్‌ను శాటిలైట్ ద్వారా ట్రాక్టర్‌కు కనెక్ట్ చేశాడు. అలా తండ్రి దగ్గర రూ. 50,000 తీసుకొని సొంతంగా ట్రాక్టర్ నడవడానికి కావాల్సినవన్నీ కొనుక్కొని ఆ రిమోట్‌ను తయారు చేశాడు. ఇప్పుడు ఎవరి సహాయం లేకుండానే రిమోట్‌తో ట్రాక్టర్‌ను నడపగలుగుతున్నాడు యోగేశ్. పొలం వద్ద ఒక ఏరియాలో యోగేశ్ రిమోట్‌ను ఆపరేట్ చేస్తుంటే ట్రాక్టర్ దానికదే పొలంలో దున్నుతుంది.


ఇప్పుడు యోగేశ్ తన ఇన్నోవేషన్‌ను అప్రూవ్ చేసుకొనే పనిలో పడ్డాడు. యోగేశ్ ఇదొక్కటే కాదు.. ఇదివరకు చాలా కొత్త కొత్త టెక్నాలజీలను కనిపెట్టాడు. యాంటీ థెప్ట్ మిషన్.. అంటే ఇంటి యజమాని లేనప్పుడు ఇంట్లోకి ఎవరైనా వస్తే యజమానికి సమాచారం అందిస్తుంది. మరోటి స్మార్ట్ పవర్ సేవర్.. అంటే రూమ్‌లో ఎవరూ లేనప్పుడు ఆటోమెటిక్‌గా లైట్స్ ఆగిపోవడం లాంటి ఇన్నోవేషన్స్‌కు యోగేశ్ ఆద్యం పోశాడు. ఇంత కష్టపడి వీటిని కనిపెట్టావు కదా.. మరి నీ ఫ్యూచర్ గోల్స్ ఏంటీ అని యోగేశ్‌ను అడిగితే... ఇండియన్ ఆర్మీ కోసం గుట్టలు, కొండలు, ఎడారుల్లో తిరగగలిగే వాహనాన్ని తయారు చేయడమే తన లక్ష్యమని ఎంతో ఉద్వేగంతో చెప్పాడు యోగేశ్. శెభాష్ యోగేశ్. నీలాంటి వాళ్లే ఈ దేశానికి కావాలి. కమాన్.. నీ లక్ష్యం కోసం నువ్వు శ్రమించు.. తప్పకుండా విజయం నీ బానిసవుతుంది.

7246
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS