ఐబీలోకి 1800 మంది ఎస్‌ఎస్‌బీ జవాన్లు

Tue,December 18, 2018 07:50 PM

1,800 SSB personnel to move to IB for special operations

న్యూఢిల్లీ: సహస్ర సీమాబల్ (ఎస్‌ఎస్‌బీ)కు చెందిన 1800 మంది జవాన్లు త్వరలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)కు మారనున్నారు. ఇండో-నేపాల్, ఇండో-భూటాన్ సరిహద్దుల వెంబడి గస్తీ కాసే ఎస్‌ఎస్‌బీ జవాన్లు నెలలోపు ఐబీకి మారుతానని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. సరిహద్దు వెంట ఇంటెలిజెన్స్ బ్యూరో ఉనికిని మరింత పెంచేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై ఎస్‌ఎస్‌బీ డైరెక్టర్ జనరల్ ఎస్‌ఎస్ దేశ్వాల్ మాట్లాడుతూ..సుశిక్షతులైన పురుషులు, మహిళా జవాన్లను ఐబీలోకి తీసుకునే అంశం చాలా ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఎస్‌బీ జవాన్ల శక్తి సామర్థ్యాన్ని, శిక్షణా నైపుణ్యం ఐబీ వారితో దాదాపు సమానంగా ఉంటాయి. అందువల్లే ప్రభుత్వం ఎస్‌ఎస్‌బీ జవాన్లను ఐబీలోకి మార్చాలని నిర్ణయించిందని వెల్లడించారు.

2414
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles