విరిగిపడ్డ కొండచరియలు : 18 మంది మృతి

Thu,August 9, 2018 01:19 PM

తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వరదలు పోటెత్తాయి. దీంతో 18 మంది మృతి చెందారు. పలువురు గల్లంతు అయ్యారు. ఇడుక్కిలో 10 మంది, మలప్పురంలో ఐదుగురు, కన్నూరులో ఇద్దరు, వాయానడ్ జిల్లాలో ఒకరు చొప్పున మృతి చెందారు. పాలక్కడ్, వాయానడ్, కోజికోడ్‌లో పలువురు అదృశ్యమయ్యారు. ఇడుక్కిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింది నుంచి మరో ఇద్దరిని ప్రాణాలతో కాపాడారు పోలీసులు. భారీ వర్షాల కారణంగా కోజికోడ్, వాయానడ్, పాలక్కడ్, ఇడుక్కి, మలప్పురం, కొల్లాంలో పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. 26 ఏళ్ల తర్వాత చీరుతోని డ్యాం గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

1947
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles