18 అడుగుల కింగ్ కోబ్రా హల్ చల్..

Thu,October 12, 2017 10:20 PM

18 feet kingkobra halchal in srikakulam

శ్రీకాకుళం: 18 అడుగుల భారీ కింగ్ కోబ్రా హల్ చల్ సృష్టించిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో వెలుగుచూసింది. కింగ్‌ కోబ్రా అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి..కంచిలి మండలంలోని బొగాబెణి గిరిజన గ్రామంలో ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడింది. కింగ్ కోబ్రాను చూసి భయపడిన ఆ ఇంట్లోని వ్యక్తి వెంటనే పరుగులు తీసి గ్రామస్థులకు సమాచారమందించాడు. గ్రామస్థులు పాములు పట్టే వ్యక్తిని తీసుకువచ్చి భారీ కోబ్రాను పట్టుకున్నారు. ఆ తర్వాత కింగ్ కోబ్రాను సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. కింగ్ కోబ్రా చిక్కడంతో గ్రామస్థులంతా ఊపిరి పీల్చుకున్నారు.
kobra-sr1

5652
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS