హిమాచల్ లో భారీ వర్షాలతో 18 మంది మృతి

Sun,August 18, 2019 08:48 PM

18 died in Himachalpradesh Rains


సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌ను భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురస్తుల వర్షంతో పలు ప్రాంతాలను వరదలు చుట్టుముట్టాయి. వర్షాలతో ఇప్పటి రాష్ట్రవ్యాప్తంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల్లో చిక్కుకున్న ఆరుగురిని రెస్క్యూ టీం కాపాడింది. సిమ్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 8 మంది చనిపోగా..కులూ, శ్రీమర్‌, సొలన్‌, చంబా జిల్లాల్లో ఇద్దరు చొప్పున చనిపోయారని ఉన్నతాధికారులు తెలిపారు. కుండపోత వర్షాలతో సిమ్లా, కులు జిల్లాల్లో విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించారు.

896
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles