హోటల్ అగ్నిప్రమాదంలో 17కు చేరిన మృతులు

Tue,February 12, 2019 10:08 AM

ఢిల్లీ: ఢిల్లీలోని కరోల్‌బాగ్ ప్రాంతంలో గల హోటల్ అర్పిత్ ప్యాలెస్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటికి మృతుల సంఖ్య 17కు చేరింది. మృతుల్లో ఓ మహిళ , పసిపాప ఉన్నారు. 12కు పైగా అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నాయి. ఈ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అందరూ నిద్రలో ఉండగా హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రాణభయంతో పలువురు భవనం టెర్రస్ పైనుంచి దూకారు. మంటలు ప్రస్తుతం అదుపులోకి వచ్చినట్లుగా సమాచారం. మొత్తం 35 మంది గాయపడ్డారు. చికిత్స నిమిత్తం రాం మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు.

1030
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles