యూపీలో ఘోర ప్రమాదం : 17 మంది మృతి

Wed,June 13, 2018 12:26 PM

17 Dead and 12 Injured After Speeding Bus Hits Divider Overturns In UP

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పూరి జిల్లాలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ధన్‌హరా ప్రాంతంలో వేగంగా వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రయాణికులు మృతి చెందగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌కు కూడా తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేయనున్నారు. ఈ ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

1893
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles