ప్రసాదం తిని 1500 మందికి అస్వస్థత

Tue,February 13, 2018 08:01 PM

1500 villagers complained of stomach ache vomiting Barwani MadhyaPradesh

మధ్యప్రదేశ్: రాష్ట్రంలోని బడ్‌వానీ పట్టణంలోని ఆశ్రమంలో జరిగిన శివరాత్రి వేడుకల్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆశ్రమంలో పంపిణీ చేసిన ప్రసాదం తిని 1500 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆశ్రమంలో కిచిడీ, మిఠాయి తీన్న వెంటనే భక్తులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు కావడంతో ఆస్పత్రులకు పరుగులు తీశారు. ఘటనపై విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, పరిస్థితి విషమంగా ఉన్నవారిని మంచి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలని ఆదేశించారు.

4218
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles