మావోల మెరుపు దాడి : 15 మంది పోలీసులు మృతి

Wed,May 1, 2019 02:34 PM

15 security personnel have lost their lives in an IED blast by Naxals in Gadchiroli

హైదరాబాద్‌ : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. 16 మందితో వెళ్తున్న పోలీసు వాహనాన్ని మావోయిస్టులు ఐఈడీతో పేల్చివేశారు. ఈ పేలుడు ధాటికి పోలీసు వాహనం చెల్లాచెదురైంది. 15 మంది పోలీసులు, డ్రైవర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మావోయిస్టుల కోసం కూంబింగ్‌ చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. గడ్చిరోలి జిల్లాలోని కుర్ఖేడాలో రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన 36 వాహనాలకు నక్సల్స్‌ నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆ వాహనాలు పూర్తిగా కాలిపోయాయి.1948
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles