బీజేపీలో చేరిన 15 మంది రెబల్‌ ఎమ్మెల్యేలు

Thu,November 14, 2019 01:21 PM

బెంగళూరు : కర్ణాటర రెబల్‌ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ గూటికి చేరారు. అనర్హతకు గురైన 17 మంది ఎమ్మెల్యేలను ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు నిన్న తీర్పునిచ్చింది. దీంతో 15 మంది రెబల్‌ ఎమ్మెల్యేలు సీఎం యెడియూరప్ప సమక్షంలో బీజేపీలో చేరారు. వారందరికీ యెడియూరప్ప కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. డిసెంబర్‌ 5న 15 స్థానాలకు జరగబోయే ఉప ఎన్నికల్లో వీరంతా బీజేపీ తరపున పోటీ చేయనున్నారు. కాంగ్రెస్‌ - జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఈ 17 మంది ఎమ్మెల్యేలు కారణమయ్యారు. మరో రెండు సీట్లకు సంబంధించిన పిటిషన్లపై కర్ణాటక హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆ స్థానాలలో ఎలక్షన్‌ కమిషన్‌ ఎన్నికలు నిర్వహించడం లేదు.1198
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles