డిస్ఫూర్‌లో 144వ సెక్షన్ అమలు

Thu,February 2, 2017 10:08 AM

144 imposed in Dimapur

డిస్పూర్: నాగాలాండ్‌లోని డిస్ఫూర్‌లో పోలీసులు 144వ సెక్షన్‌ను విధించారు. పట్టణ స్థానిక ఎన్నికల సందర్భంగా నిన్న ఘర్షణ చోటుచేసుకుంది. సీఎం టీఆర్ జీలియాంగ్ నివాసం వద్ద ఆందోళనకారులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణలో ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. పోలీసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీఛార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు.

953
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles