బొగ్గు గ‌నిలో చిక్కుకున్న 13 మంది

Sat,December 15, 2018 10:49 AM

13 trapped in rat hole mine in Meghalaya, rescue operations continue

జాంటియా : మేఘాల‌యాలో ఓ బొగ్గు గ‌నిలో 13 మంది చిక్కుకున్నారు. రెండు రోజుల‌గా వాళ్లు ఆ గ‌నిలోనే ఉన్నారు. వారిని బ‌య‌ట‌కు తీసేందుకు భారీగా రెస్క్యూ ఆప‌రేష‌న్ జ‌రుగుతోంది. సుమారు వంద మంది ఈ ఆప‌రేష‌న్‌లో పాల్గొన్నారు. 320 ఫీట్ల లోతున్న గ‌నిలో వ‌ర్క‌ర్లు చిక్కుకున్నారు. గ‌ని నుంచి నీటిని బ‌య‌ట‌కు తోడేస్తున్నారు. ర్యాట్ హోల్‌లో చిక్కుకున్న‌వారిని బ‌య‌ట‌కు తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్‌, ఎస్డీఆర్ఎఫ్‌, సివిల్ డిఫెన్స్ ద‌ళాలు రంగంలోకి దిగాయి. తూర్పు జాంటియా హిల్స్‌లో ఉన్న ర్యాట్ హోల్ మైన్ చాలా పురాత‌న‌మైంద‌ని పోలీసులు తెలిపారు. మైనింగ్ ఓన‌ర్‌పై ఫిర్యాదును న‌మోదు చేశారు. ప్ర‌స్తుతం అత‌ను ప‌రారీలో ఉన్నాడు.

1961
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles