పెళ్లి బారాత్‌పైకి దూసుకెళ్లిన ట్రక్కు : 13 మంది మృతి

Tue,February 19, 2019 09:19 AM

13 Killed as Truck Mows Down Baraat Procession on Jaipur Highway

జైపూర్‌ : రాజస్థాన్‌లోని ప్రతాప్‌ఘర్‌ - జైపూర్‌ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పెళ్లి వేడుకలో భాగంగా బారాత్‌ నిర్వహిస్తుండగా.. వారందరి పైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పెళ్లి కూతురు తీవ్రంగా గాయపడింది. ట్రక్కు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాద ఘటనపై రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని ఆయన వెల్లడించారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు అశోక్‌ గెహ్లాట్‌ ట్వీట్‌ చేశారు.2069
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles