లోయలోపడిన బస్సు: 13 మంది మృతిTue,March 13, 2018 09:50 PM

లోయలోపడిన బస్సు: 13 మంది మృతి

నైనిటాల్ : ఉత్తరాఖండ్‌లో ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడటంతో 13 మంది మరణించగా, 11 మంది గాయాలపాలయ్యారు. అల్మోరా జిల్లాలోని దెఘాట్ నుంచి నైనిటాల్ జిల్లా రామ్‌నగర్‌కు వెళ్తుండగా టోటమ్ గ్రామ సమీపాన ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ప్రమాదం జరిగినపుడు బస్సులో 24 మంది ప్రయాణిస్తున్నారు. మరణించిన వారిలో తొమ్మిదిమందిని గుర్తించామని, వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారని అల్మోరా సీనియర్ ఎస్పీ బీ రేణుకా దేవి తెలిపారు. ఈ ప్రమాదం గురించి తెలియగానే సహాయక చర్యలను ప్రారంభించాం. క్షతగాత్రులను దగ్గరలోని దవాఖానకు తరలించాం. తీవ్రంగా గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించేందుకు హాల్దావానికి తరలించాం. బస్సు ప్రమాదంపై విచారణ ప్రారంభించాం. సహాయకచర్యలను అధికారులు, పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు కొనసాగిస్తున్నాయి అని ఎస్పీ తెలిపారు. బస్సుప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేండ్ర సింగ్ రావత్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం చెప్పారు.

1850
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS