ఉత్త‌రాఖండ్ లో ఘోర ప్ర‌మాదం : 12 మంది మృతి

Sun,November 18, 2018 06:54 PM

12 tourists dies in road accident in Uttarakhand

డెహ్రాడూన్ : ఉత్త‌రాఖండ్ లోని ఉత్త‌ర‌కాశీ - య‌మోత్రి హైవేపై ఆదివారం ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. ప‌ర్యాట‌కుల‌తో వెళ్తున్న ఓ ప్ర‌యివేటు బ‌స్సు అదుపుత‌ప్పి రోడ్డు ప‌క్క‌నే ఉన్న 150 మీట‌ర్ల లోతు లోయ‌లో ప‌డిపోయింది. ఈ ప్ర‌మాదంలో 12 మంది మృతి చెంద‌గా, మ‌రో 13 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌మాదం జ‌రిగిన స్థ‌లంలో 10 మంది మృతి చెందిన‌ట్లు అధికారులు తెలిపారు. మ‌రో ఇద్ద‌రు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. గాయ‌ప‌డ్డ వారిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. ప్ర‌మాద‌స్థ‌లికి చేరుకున్న హెలికాప్ట‌ర్ ద్వారా మృత‌దేహాల‌ను, క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో బ‌స్సులో 30 మందికి పైగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌మాదంపై ఉత్త‌రాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ విచారం వ్య‌క్తం చేస్తూ.. మృతుల కుటుంబాల‌కు సంతాపం వ్య‌క్తం చేశారు. క్ష‌త‌గాత్రుల‌ను డెహ్రాడూన్ లోని ఆస్ప‌త్రికి త‌ర‌లించి వైద్యం అందించాల‌ని ఆదేశించారు.

2663
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles