13 మందిని బలిగొన్న కల్తీ సారా

Fri,February 8, 2019 01:52 PM

12 people have died in Uttarakhand after consuming illicit liquor

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల సరిహద్దులోని నాలుగైదు గ్రామాల్లో విషాదం నెలకొంది. కల్తీ సారా సేవించడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా, యూపీ శరహాణ్‌పూర్ జిల్లాలోని నాలుగైదు గ్రామాల ప్రజలు ఓ వ్యక్తి అంత్యక్రియల కోసం బాలుపూర్(హరిద్వార్)కు వచ్చారు. అంత్యక్రియలు ముగిసిన అనంతరం కొందరు వ్యక్తులు కల్తీ సారా సేవించారు. దీంతో హరిద్వార్ జిల్లాకు చెందిన 8 మంది, శరహాణ్‌పూర్ జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 13 మంది ఎక్సైజ్ శాఖ అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

1379
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles