వీడియో: కాలేజీలో దూరిన 12 అడుగుల కొండచిలువThu,December 7, 2017 04:01 PM
వీడియో: కాలేజీలో దూరిన 12 అడుగుల కొండచిలువ

చిన్న చిన్న పాములను చూస్తేనే దడుసుకుంటాం. ఆమడ దూరం పరిగెడతాం. మరి ఏకంగా 12 అడుగుల కొండ చిలువ కనిపిస్తే ఇంకేమన్నా ఉందా? పరుగందుకోము. 12 అడుగుల కొండ చిలువ ఏకంగా ఓ డిగ్రీ కాలేజీలో దూరింది. ఇక.. ఆ కొండ చిలువను చూసిన స్టూడెంట్స్ దెబ్బకు పరుగు లంకించుకున్నారు. కాలేజీ మొత్తం కొండ చిలువను చూసి అల్లకల్లోలమయింది. ఈ ఘటన అలహాబాద్‌లోని శ్యామ ప్రసాద్ ముఖర్జీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో నిన్న జరిగింది.

అయితే.. బాటనీ ప్రొఫెసర్ ఎన్‌బీ సింగ్ మాత్రం ఎంతో దైర్యంతో 12 అడుగులు ఉన్న కొండ చిలువను పట్టుకున్నాడు. వెంటనే ఫారెస్ట్ డిపార్ట్ మెంట్‌కు సమాచారం అందివ్వగానే వాళ్లు వచ్చి దాన్ని తీసుకెళ్లి అడవిలో వదిలేశారు. ఆ కొండ చిలువ దాదాపు 40 కిలోల బరువుంది. అయితే.. దాన్ని పట్టుకోవడానికి మాత్రం సింగ్ చాలా కష్టపడ్డాడట.

ఎన్‌బీ సింగ్‌కు పాములను పట్టడమంటే మహా సరదా అట. వాటికి ఎటువంటి అపాయం కలగకుండా జనసంచారం నుంచి దూరంగా తీసుకెళ్లి వదిలేస్తుంటాడట. ఇదే కాలేజీలో ఆయన చాలా సార్లు పాములను పట్టి అటవీ సిబ్బందికి అందించాడట. అదే నైపుణ్యంతో ఈ కొండ చిలువను పట్టుకోగలిగానని ఆయన చెప్పాడు.

1375
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS