కిడ్నాప్ డ్రామా ఆడిన 11 ఏళ్ల బాలుడు..

Wed,October 17, 2018 02:00 PM

నోయిడా : ఇంట్లోనే దొంగతనం చేస్తున్న ఓ బాలుడిని తల్లిదండ్రులు తిట్టారు. దీంతో తనను తల్లిదండ్రులు నిత్యం తిడుతున్నారని ఆ బాలుడు ఇంట్లో నుంచి పారిపోయి.. కిడ్నాప్ డ్రామా ఆడి.. అటు తల్లిదండ్రులకు, ఇటు పోలీసులకు ఉరుకులు పరుగులు పెట్టించాడు. నోయిడాకు చెందిన ఓ వ్యక్తి కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆయన కుమారుడు(11) ఆరో తరగతి చదువుతున్నాడు. అయితే దుకాణ యజమాని కుమారుడు.. షాపులో దొంగతనం చేస్తూ.. ఇంటి పనులు చేయడం మానేశాడు. మంగళవారం కూడా తన తల్లిదండ్రులు తిట్టడంతో.. షాపులో ఉన్న రూ. 100 తీసుకొని ఇంటి నుంచి పారిపోయాడు. లిఫ్ట్ అడ్డుక్కొని బైక్‌పై గ్రేటర్ నోయిడాలోని బిస్రాఖ్ చేరుకున్నాడు బాలుడు. ఇక రూ. 100 అయిపోవడంతో.. అక్కడున్న ఓ వ్యక్తి వద్ద మొబైల్ తీసుకున్న బాలుడు.. తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. తనను కిడ్నాప్ చేశారు తక్షణమే రూ. 5 లక్షలు తీసుకొని వచ్చి కాపాడండి అంటూ ఫోన్ పెట్టేశాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తానికి బాలుడు ఫోన్ చేసిన నెంబర్‌ను చేధించి.. బాలుడి ఆచూకీని కనుగొన్నారు. బాలుడు ఆడిన కిడ్నాప్ డ్రామాను చూసి పోలీసులు విస్తుపోయారు.

3114
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles