ఓటేసిన 107 ఏళ్ల బామ్మ..

Thu,April 18, 2019 06:14 PM

107 year old Padma awardee Saalumarada Thimmakka Casts her vote


కర్ణాటక: 107 ఏళ్ల బామ్మ, పద్మ అవార్డు గ్రహీత సాలుమారద తిమ్మక్క తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బెంగళూరు రూరల్ పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న పోలింగ్‌లో ఆమె ఓటు వేశారు. సాలుమారద తిమ్మక్క వేల సంఖ్యలో మొక్కలు నాటి పర్యావరణ రక్షణలో తనవంతు కీలక పాత్ర పోషించారు. ఆమె పద్మ పురస్కారంతోపాటు నేషనల్ సిటిజన్స్ అవార్డు ఆఫ్ ఇండియా అవార్డును అందుకున్నారు. సాలుమారద తిమ్మక్క ఈ వయస్సులో కూడా ఓటు వేసి..ఓటు వేయాల్సిన ప్రాధాన్యతను దేశప్రజలకు తెలియజేశారు. బెంగళూరులో రెండో విడత పోలింగ్‌లో ఇవాళ 14 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

1920
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles