ఓటేసిన 103 ఏండ్ల బామ్మ

Sun,May 19, 2019 10:46 AM

103 year old woman has cast her vote in Sulur in tamilnadu

తమిళనాడు: ఇవాళ లోక్‌సభ ఏడో విడుత ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా మొత్తం 59 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. ఎండను సైతం లెక్కచేయకుండా ఓటర్లు.. పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేస్తున్నారు.

తమిళనాడులోని సూలూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో 103 ఏళ్ల బామ్మ ఓటేసింది. ఈ వయసులోనూ నడుచుకుంటూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేసి వచ్చిన బామ్మను చూసి పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటర్లు ఆశ్చర్యపోయారు.

368
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles