చెన్నై రైల్వే స్టేషన్‌లో వెయ్యి కిలోల కుక్క మాంసం పట్టివేత

Sat,November 17, 2018 08:32 PM

1000 kg dog meat seized in chennai egmore railway station

చెన్నై: చదవడానికి కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు కానీ చదవాల్సిందే. ఒకటి కాదు.. రెండు కాదు వెయ్యి కిలోల కుక్క మాంసాన్ని చెన్నైలోని ఎగ్మూర్ రైల్వేస్టేషన్‌లో పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్ నుంచి చెన్నై వచ్చిన జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ నుంచి ఓ పార్శిల్‌ను దించారు. ఐదో నెంబర్ ప్లాట్‌ఫాం వద్ద ఆ పార్శిల్‌ను ఉంచారు. అయితే.. రాజస్థాన్ నుంచి కుక్కల మాంసం స్మగ్లింగ్ అవుతోందంటూ రైల్వే పోలీసులకు సమాచారం అందింది. దీంతో రైల్వే స్టేషన్‌ను క్షుణ్ణంగా తరలిస్తుంటే అనుమానాస్పదంగా ఉన్న ఆ పార్శిల్ కనిపించింది. ఆ పార్శిల్‌ను ఓపెన్ చేసి చూసి షాకయ్యారు పోలీసులు. ఆ పార్శిల్‌లో వెయ్యి కిలోల మాంసం ఉంది. దాన్ని పరీక్షించగా.. అది కుక్కల మాంసంగా తేల్చారు. వెంటనే మాంసాన్ని సీజ్ చేసి పరీక్షల కోసం ల్యాబ్‌కు తరలించారు. చెన్నైలోని రెస్టారెంట్లకు తరలించడానికే మాంసాన్ని రాజస్థాన్ నుంచి తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు.

7590
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles