బులెట్‌రైలుకు వ్యతిరేకంగా వెయ్యిమంది గుజరాత్ రైతుల పిటిషన్

Tue,September 18, 2018 06:48 PM

1000 gujarat farmers file affidavit against bullet train

ప్రధాని నరేంద్రమోదీ కలల ప్రాజెక్టు ముంబై-అహ్మదాబాద్ బులెట్‌రైలును గుజరాత్ రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆందోళన కూడా నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టు కింద భూములు కోల్పోయే వివిధ జిల్లాలకు చెందిన వెయ్యిమంది రైతులు మంగళవారం గుజరాత్ హైకోర్టులో మూకుమ్మడి అఫిడవిట్ సమర్పించారు. రైలుమార్గం కోసం తమ భూములను స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు అందులో తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుత భూసేకరణ విధానాలు ప్రాజెక్టుకు అల్పవడ్డీ రుణం సమకూరుస్తున్న జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

2015 సెప్టెంబర్‌లో జపాన్ భారత్‌తో బులెట్‌రైలు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత గుజరాత్ సర్కారు భూసేకరణ చట్టం నిబంధనలను నీరుగార్చిందని రైతులు ఆరోపించారు. పునరావాసం, తరలింపునకు సంబంధించి సామాజిక ప్రభావ అంచనా కూడా ప్రభుత్వం వేయడం లేదని రైతులు తమ అఫిడవిట్‌లో తెలిపారు. ప్రభుత్వ విభాగాలు రైతులకు తెలియకుండా ఏవేవో చర్యలు చేపడుతున్నారని వివరించారు. గత ఐదువారాలుగా హైకోర్టు విచారణ ముందుకు సాగడం లేదని, ప్రాజెక్టుని ఆపాల్సిందిగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని రైతుల తరఫు న్యాయవాది మీడియాకు చెప్పారు. కేంద్రం హైకోర్టుకు సమాధానాన్ని దాటవేస్తున్నదని ఆయన వివరించారు.

3412
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles