ఒక్కొక్కడినీ కాల్చి చంపండి.. ప్రధానికి పదేళ్ల బాలిక లేఖ

Wed,February 20, 2019 02:59 PM

10 year old writes a letter to PM Narendra Modi seeking Revenge over Pakistan

న్యూఢిల్లీ: పుల్వామా దాడిపై దేశం మొత్తం రగిలిపోతున్నది. పాకిస్థాన్‌పై ప్రతీకారం కోసం ఆరాటపడుతున్నది. అందులో ఓ పదేళ్ల బాలిక కూడా ఉంది. గుజరాత్‌లోని సూరత్ జిల్లా పూనాకు చెందిన మనాలీ అనే ఈ పాప ఏకంగా ప్రధాని మోదీకే లేఖ రాసింది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు కాల్చి చంపాలని, పాకిస్థాన్‌పైనా ప్రతీకారం తీర్చుకోవాలని నాలుగో తరగతి చదువుతున్న ఈ పాప ఆ లేఖలో కోరడం విశేషం. ఇప్పుడీ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దాడి జరిగిన సమయంలో ఇంట్లో హోమ్‌వర్క్ చేస్తూ ఉన్న మనాలీ.. టీవీలో వార్త చూసి చాలా బాధపడింది. ప్రధానమంత్రితో మాట్లాడొచ్చా అని తన తల్లిని అడిగితే.. మాట్లాడటం కుదరదు కానీ లేఖ రాయమని సూచించింది. దీంతో హిందీలో ఆ పాప ఓ లేఖ రాసి ప్రధానికి పంపించింది. అలాంటి వాళ్ల‌ను చంప‌డం పాపం కాద‌ని భ‌గ‌వ‌ద్గీత‌లోనూ ఉన్న‌ద‌ని ఆ పాప చెప్ప‌డం విశేషం.

5450
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles