40వేల కాలేజీల్లో ఈబీసీ కోటా

Wed,January 16, 2019 03:42 PM

10 percent EWS quota will be implemented in this academic year in 40000 Colleges

న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనుక‌బ‌డిన అగ్ర‌కులాల పేద‌ల‌కు ప‌ది శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని ఇటీవ‌ల పార్ల‌మెంట్‌లో బిల్లు పాసైన విష‌యం తెలిసిందే. అయితే ఆ కోటాను ఈ ఏడాది విద్యా సంవ‌త్స‌రం నుంచి అమ‌లు చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని కేంద్ర మాన‌వ‌వ‌న‌రుల శాఖ మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ తెలిపారు. 2019-20 సంవ‌త్స‌రం నుంచి విద్యాల‌యాల్లో ఈడ‌బ్ల్యూఎస్‌ రిజ‌ర్వేష‌న్‌ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. వార్షిక ఆదాయం 8 ల‌క్ష‌ల లోపు ఉన్న అగ్ర‌వ‌ర్ణ పేద‌లు మాత్రమే ఈబీసీ కోటా కింద సీట్లు పొంద‌వ‌చ్చు. స్కూళ్లు, కాలేజీలు ఈ కోటాను అమ‌లు చేస్తాయ‌ని మంత్రి తెలిపారు. ఈబీసీతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటాను కూడా అమ‌లు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న చెప‌పారు. దేశ‌వ్యాప్తంగా మొత్తం 40 వేల కాలేజీలు, 900 వ‌ర్సిటీల్లో ఈబీసీ కోటా అమ‌లు చేస్తార‌న్నారు. ఈబీసీ కోటా అమ‌లు కోసం ప్ర‌త్యేకంగా విద్యా సంస్థ‌ల్లో 25 శాతం సీట్ల‌ను కూడా పెంచ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.2210
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles