బీజేపీలో చేరిన 10 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

Thu,July 11, 2019 05:31 PM

10 Goa Congress MLAs joined BJP today


పానాజీ: గోవాలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఇవాళ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా, గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ సమక్షంలో 10 మంది ఎమ్మెల్యేలు కాషాయకండువా కప్పుకున్నారు. గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలుండగా..2017 ఎన్నికల్లో బీజేపీ 17 స్థానాలతో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌ 15 స్థానాలు గెలుచుకుని ప్రతిపక్షంగా వ్యవహరించింది. అయితే తాజాగా 10 మంది ఎమ్మెల్యేలు ఖాళీ అయి బీజేపీలో చేరడంతో.. బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 27కు చేరగా..కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 5కు పడిపోయింది.

2057
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles