తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయానికి 10 కోట్లు

Thu,February 1, 2018 01:40 PM

10 crores allocation to Telangana Tribal University

న్యూఢిల్లీ : తెలంగాణ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం రూ. 10 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. కేంద్ర బడ్జెట్ 2018-19లో గిరిజన విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించారు. అదే విధంగా హైదరాబాద్ ఐఐటీకి రూ. 75 కోట్లు కేటాయించారు. తెలంగాణలో గిరిజన యూనివర్సిటీని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు సమీపంలోని జాకారంలో ఏర్పాటు చేయనున్నారు. దీంతో ములుగుకు జాతీయ స్థాయిలో గుర్తింపు రానుంది. దేశంలో తొలి గిరిజన విశ్వవిద్యాలయం మధ్యప్రదేశ్‌లోని అమరకంఠక్‌లో ఉండగా, ములుగులో ఏర్పాటయ్యే వర్సిటీ రెండోదిగా రికార్డులకెక్కనుంది.

3182
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles