e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, April 10, 2021
Advertisement
Home నారాయణపేట ఒక్కో రోగికి రూ.60వేలు

ఒక్కో రోగికి రూ.60వేలు


వనపర్తి జిల్లా దవాఖానకు మరో 5 యూనిట్లు మంజూరు
కొత్త యూనిట్లతో మరో 45 మందికి డయాలసిస్‌ సేవలు
దేశంలోనే తొలిసారిగా సింగిల్‌ యూజ్డ్‌ విధానం

వనపర్తి , ఏప్రిల్‌ 7 : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన త రువాత వైద్య రంగంలో సమూల మార్పులొచ్చా యి. ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్‌కు దీటుగా వైద్య సేవలందుతున్నాయి. దీంతో ఓపీ సేవలు పెరిగాయి. అన్ని రకాల సేవలందించేందుకు మెరుగైన వసతులు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా 2018లో వనపర్తి జిల్లా దవాఖానలో రూ.కోటి వె చ్చించి ఐదు యూనిట్లతో డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గతంలో డయాలసిస్‌ చేయించుకునేందుకు బాధితులు హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, కర్నూల్‌ ప్రాంతాలకు వెళ్లేవారు. కానీ నేడు స్థానికంగానే సేవలందుతున్నాయి. ఈ దవాఖాన లో ప్రస్తుతం 47 మంది సేవలను అందిపుచ్చుకుంటున్నప్పటికీ.. మరో 42 మంది వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నారు. కాగా, ఇటీవల వనపర్తి దవాఖానకు పాత ఐదు డయాలసిస్‌ యూనిట్లకు అదనంగా మరో ఐదు యూనిట్లు మంజూరయ్యాయి. ఇందుకు మంత్రి నిరంజన్‌రెడ్డి కృషి అభినందనీయం. దీంతో మొత్తం పది యూనిట్లతో వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న 42 మందితో పాటు మరో ముగ్గురికి సేవలను అందించే అవకాశం ఏర్పడనున్నది. దూర ప్రాంతాలకు వెళ్లి చికిత్సలు చేయించుకోవాలంటే రూ.వేల ల్లో ఖర్చు కావడంపాటు వ్యయప్రయాసాలకోర్చేవారు. నేడు స్థానికంగా సేవలందుతుడడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

దేశంలోనే మొదటిసారిగా..
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో ఏర్పాటు చే స్తున్న డయాలసిస్‌ కేంద్రాలకు ఎంతో ప్రత్యేకత ఉ న్నది. దేశంలోనే తొలిసారిగా సింగిల్‌ యూజ్డ్‌ పై పులను వాడుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న డయాలసిస్‌ కేంద్రాల్లో ఒకే పైపు వ్యవస్థను పది మంది రోగుల వరకు ఉపయోగించేవారు. దీంతో ఇతర సమస్యలు ఉత్పన్నమై రోగులు ఇబ్బందులు పడేవారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణలో సింగిల్‌ యూజ్డ్‌ పైపులను వాడుతున్నారు. దీంతో సమయం ఆదా కావడంతోపాటు బాధితులకు ఇతర రోగాలు దరి చేరకుండా ఉంటున్నది.

ఒక్కో రోగికి రూ.60వేల ఖర్చు..
ప్రతి డయాలసిస్‌ రోగికి నెలకు రూ.60వేల చొ ప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. జిల్లా దవాఖానలో నెలకు 47 మందికి 470 కిట్లతో చికిత్స చే స్తూ.. రూ.28.20 లక్షలు భరిస్తున్నది. నూతనంగా మంజూరైన ఐదు యూనిట్లతో మరో 42 మందికి రూ.25.20 లక్షలతో వైద్య సేవలందించనున్నారు. మొత్తంగా 89 మందికి గానూ రూ.53.40 లక్షలు ఖర్చు చేయనున్నారు. డయాలసిస్‌ కేంద్రానికి వచ్చే ప్రతి బాధితుడికి నాలుగు గంటల పాటు వైద్య సేవలందిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికీ రూ.1,800 నుంచి రూ,2,500 విలువైన వ్యాక్సిన్లు ఇస్తూ.. వ్యాధి తీవ్రతను బట్టి రెండు లేదా మూడు రోజులకోసారి సేవలందిస్తున్నారు.లాక్‌డౌన్‌ సమయంలోనూ నిరంతరంగా డయాలసిస్‌ చికిత్స నిర్వహించారు.

అందుబాటులో డయాలసిస్‌ సేవలు..
ఒకప్పుడు డయాలసిస్‌ సేవలు హైదరాబాద్‌కే పరిమితం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ డయాలసిస్‌ రోగుల ఇబ్బందులు గమనించి జిల్లా ఏరియా దవాఖానల్లో యూనిట్లు ఏర్పాటు చేశారు. ప్రసుత్తం ఉన్న యూనిట్లు సరిపోవడం లేదనే మరో ఐదు యూనిట్లను మంజూరు చేశారు. సామాన్యులకు వైద్యం అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది.

  • సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి

లాక్‌డౌన్‌లోనూ సేవలు..
లాక్‌డౌన్‌ సమయంలోనూ కిడ్నీ బాధితులకు సేవలందించాం. రెండు రోజులకోసారి వైద్య సేవలందించకపోతే వారి పరిస్థితి వర్ణనాతీతం. దీంతో సిబ్బంది, వైద్యులు కరోనాకు భయపడకుండా సేవలందించారు. నూతనంగా ఐదు యూనిట్లు మంజూరు కావడంతో ప్రసుత్తం ఉన్న 47 మందితో పాటు వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న 42 మందికి చికిత్స ఇవ్వనున్నాం.

  • హరీశ్‌సాగర్‌, సూపరింటెండెంట్‌, వనపర్తి జిల్లా దవాఖాన

నెలకు 60 వేల దాకా ఖర్చయ్యేది
నా పేరు భాగ్యలక్ష్మి, పెబ్బేరు మాది. గత మూడేండ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నా. జిల్లా దవాఖానలో రెండు రోజులకోసారి వచ్చి ఖర్చు లేకుండా వైద్యం చేయించుకుంటున్నా. ఇంతకుముందు బయట దవాఖానలో చూయించుకుంటే నెలకు రూ.60వేలదాకా ఖర్చయితుండే. ఇప్పుడు పైసల తిప్పలు తప్పింది. శానా సంతోషం అయితున్నది. ఇక్కడ డాక్టర్లు కూడా మంచిగ చూస్తరు.

  • భాగ్యలక్ష్మి, కిడ్నీ బాధితురాలు, పెబ్బేర్‌
Advertisement
ఒక్కో రోగికి రూ.60వేలు

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement