e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home జిల్లాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలతో రైతులకు లాభం

ధాన్యం కొనుగోలు కేంద్రాలతో రైతులకు లాభం

ధాన్యం కొనుగోలు కేంద్రాలతో రైతులకు లాభం

జడ్చర్ల, ఏప్రిల్‌ 29: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు ఎంతోలాభం కలుగుతుందని జెడ్పీ వైస్‌చైర్మన్‌ యాదయ్య అన్నారు. గురువారం జడ్చర్ల మండలంలోని నసరుల్లాబాద్‌ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా రైతులు ఇబ్బందులు పడకుండా వారివారి గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడే పీఏసీసీఎస్‌, ఐకేపీల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. దీంతో రైతులు తాము పండించించిన ధాన్యంను తమతమ గ్రామాల్లోనే అమ్ముకోవడం జరుగుతుందని అదేవిధంగా రవాణఖర్చులు కూడా తగ్గిపోవడమే కాకుండా సమయం వృథా కావడం లేదన్నారు. రైతుల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించారన్నారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్‌చందర్‌, పీఏసీసీఎస్‌ అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్‌, రైతుసంఘం మండల కోఆర్డినేటర్‌ జంగయ్య, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, చర్లపల్లి సర్పంచ్‌ శ్రీనివాస్‌, నసరుల్లాబాద్‌తండా సర్పంచ్‌ సిరి శ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ రవి, ఏపీఎం మాల్యానాయక్‌, సీసీ ఈశ్వర్‌, గ్రామస్తులు మునవర్‌, నరేందర్‌, శేఖర్‌, మహేశ్‌ తదితరులు ఉన్నారు.
అయ్యవారిపల్లిలో..
మిడ్జిల్‌, ఏప్రిల్‌ 29: మండలంలోని అయ్యవారిపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్‌ సునీతారెడ్డి ప్రారంభించారు. పీఏసీసీఎస్‌ ఆధ్వర్యంలో రైతులకు అందుబాటులో ధాన్యం కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మధ్య దళారులను నమ్మి మోసపోద్దని సూచించారు. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరను అందిస్తుందని సూచించారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహారెడ్డి, బాల్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ధాన్యం కొనుగోలు కేంద్రాలతో రైతులకు లాభం

ట్రెండింగ్‌

Advertisement