e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home జిల్లాలు సురవరం.. సాహిత్య శిఖరం

సురవరం.. సాహిత్య శిఖరం

సురవరం.. సాహిత్య శిఖరం

కొవిడ్‌ కట్టడికే వ్యాక్సినేషన్‌
మానసిక బలంతో కరోనాను జయించొచ్చు : మంత్రి నిరంజన్‌రెడ్డి ఘనంగా సురవరం జయంతి
75 మందికి సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

వనపర్తి, మే 28 : పలు రంగాల్లో తనదైన శైలిలో ము ద్ర వేసుకున్న భావితరాలకు సురవరం ప్రతాపరెడ్డి జీవి తం మార్గదర్శనం అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరె డ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. సురవరం ప్రతాపరెడ్డి 125 వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేం ద్రంలోని సురవరం పార్క్‌లో ఉన్న కాంస్య విగ్రహానికి జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డితో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ సురవరం సాహితీవేత్తగా, పత్రిక సంపాదకులుగా, రాజకీయవేత్తగా రాణించారన్నారు. తెలంగాణ ఖ్యాతిని దేశం నలుమూలలా వ్యాపింపజేసిన మహనీయుడు అని గుర్తు చేశారు. సురవరం అంటేనే సాహిత్య శిఖరానికి నిలువెత్తు నిదర్శమని, సాహిత్యం నుంచి వైజ్ఞానిక దృష్టి వరకు దృష్టి సారించని, చదువుకు ప్రాధాన్యతనిచ్చి అన్ని వర్గాల ప్రజల్లో సాంఘీక, రాజకీయ చైతన్యం తెచ్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కించుకున్న తొలి తెలుగు రచన ఆ యనదేనన్నారు. వనపర్తి మొదటి శాసనసభ్యుడైన ఆ యన పదవీ కాలం పూర్తి కాకుండానే మరణించడం బా ధాకరమన్నారు. సురవరానికి సరితూగే వారు మళ్లీ వస్తారనుకోవడం, చూస్తామనుకోవడం అత్యాశేనన్నారు. వనపర్తి సాహితీ కళావేదిక సహకారంతో ఆయన రచనలతో మరో సంకలనం తీసుకురాబోతున్నామని, రచనలన్నింటినీ వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని మొదలుపెట్టామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, తెలంగాణ మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ శ్రీధర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రమేశ్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్లు సత్యం, లక్ష్మీనారాయణ, నారాయణ, కృష్ణయ్య, కృష్ణ, నాగన్నయాదవ్‌, నాయకులు కృష్ణయ్య, శ్యామ్‌కుమార్‌, పరంజ్యోతి, శరవంద, గిరి, హేమంత్‌, నాయకులు, సాహితీ కళావేదిక సభ్యులు వీరన్న, గోపి తదితరులు పాల్గొన్నారు.
కరోనా కట్టడికే టీకాలు..
రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నదని, ఇందులో భాగంగానే సూపర్‌స్ప్రెడర్లు, జర్నలిస్టులకు వ్యాక్సిన్‌ వేస్తున్నట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో వ్యాక్సినేషన్‌ను వనపర్తి కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషాతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ సూపర్‌స్ప్రెడర్లు, ఫ్రంట్‌లైన్‌ వారియర్లు అయిన జర్నలిస్టుకు కలిపి మొత్తం రెండు వేల మందికి వ్యాక్సిన్‌ వేస్తున్నట్లు చెప్పారు. రెండు రోజు ల పాటు వ్యాక్సినేషన్‌ కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో అమరేందర్‌, డీఎంహెచ్‌వో శ్రీనివాసు లు, తాసిల్దార్‌ రాజేందర్‌, జర్నలిస్టులు పాల్గొన్నారు.
కొవిడ్‌ బాధితులు కృంగిపోకూడదు..
కరోనా వచ్చిందని కృంగి పోకుండా, ఆత్మైస్థెర్యంతో ప్రభుత్వం అందజేస్తున్న మందులను క్రమం తప్పకుం డా వేసుకుంటే సులభంగా బయటపడొచ్చని మంత్రి ని రంజన్‌రెడ్డి తెలిపారు. అనారోగ్యం బారిన పడిన బాధితులకు సీఎం సహాయనిధి నుంచి 75 మందికి మంజూరైన రూ.15.15 లక్షల విలువ గల చెక్కులను శుక్రవారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించకుండా ఇష్టానుసారంగా రోడ్లపై తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సురవరం.. సాహిత్య శిఖరం

ట్రెండింగ్‌

Advertisement