e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home జిల్లాలు పాలమూరు వాసులకు అరుదైన గౌరవం

పాలమూరు వాసులకు అరుదైన గౌరవం

పాలమూరు వాసులకు అరుదైన గౌరవం

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జనార్దన్‌రెడ్డికి టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా అవకాశం
బాలానగర్‌ మండలం పెద్దాయపల్లిలో హర్షాతిరేకాలు
కమిషన్‌ సభ్యురాలిగా కొల్లాపూర్‌కు చెందిన కోట్ల అరుణకుమారి
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన కోసా సభ్యులు

మహబూబ్‌నగర్‌, మే 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బి. జనార్దన్‌రెడ్డి ఎంపికయ్యారు. బాలానగర్‌ మండ లం పెద్దాయపల్లికి చెందిన జనార్దన్‌రెడ్డి ఎంపికపై స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రా థమిక, ఉన్నత విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే పూర్తిచేసిన జనార్దన్‌ రెడ్డికి విద్యా వ్యవస్థపై చక్కని పట్టు ఉన్నదని స్థానికులు చెబుతున్నారు. పె ద్దాయపల్లికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలానగర్‌ మండల కేంద్రంలో ఆయన ఒకటి నుం చి పది వరకు చదువుకున్నారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఎం వీఎస్‌ జూనియర్‌ కళాశాలలో పూర్తి చేశారు.

వెటర్నరీ సైన్స్‌లో డిగ్రీ, రాజేంద్రనగర్‌ అగ్రికల్చర్‌ యూ నివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. గ్రామంలో విద్యుత్‌ సౌకర్యం సరిగా లేక లాంథరు వెలుగులో చదువుకున్న జనార్దన్‌రెడ్డి టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ పోస్టుకు సరై న వ్యక్తి అని గ్రామస్తులు అంటున్నారు. 1990లో ఏపీపీఎస్సీ గ్రూప్‌-1లో మంచి ర్యాంకు సాధించి డిఫ్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. వరంగల్‌, అ నంతపురం కలెక్టర్‌గా, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా, విద్యాశాఖ కమిషనర్‌గా పనిచేశారు. వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కమిషనర్‌గా పనిచేస్తున్న ఆయనను టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వెనకబడిన పాలమూ రు జిల్లాకు చెందిన వ్యక్తిని రాజ్యాంగబద్ధ పదవిలో నియమించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సభ్యురాలిగా కోట్ల అరుణకుమారి..
కొల్లాపూర్‌ రూరల్‌, మే 19 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొల్లాపూర్‌ పట్టణానికి చెందిన కోట్ల అరుణకుమారిని తెలంగాణ పబ్లిక్‌ కమిషన్‌ సభ్యురాలిగా ని యమించినందుకు కొల్లాపూర్‌ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఏఎస్పీ మురళి, ప్రధాన కార్యదర్శి రమేశ్‌, సభ్యులు అర్జున్‌గౌడ్‌, మదన్‌మోహన్‌, శ్రీకాంత్‌ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతమైన కొల్లాపూర్‌ వాసికి అరుదైన గౌరవం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కోట్ల అరుణకుమారి కొల్లాపూర్‌ పూర్వ విద్యార్థుల సంఘంలో సభ్యురాలని వారు కొల్లాపూ ర్‌ ఓల్డ్‌ స్టూడెంట్‌ అసోసియేషన్‌ (కోసా) ప్రకటన లో పేర్కొన్నారు. కోట్ల అరుణకుమారి బీఎస్సీ బీఈ డీ, ఎంఏ ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. ప్రస్తుతం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పాలమూరు వాసులకు అరుదైన గౌరవం

ట్రెండింగ్‌

Advertisement