e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 8, 2021
Home నారాయణపేట Makthal: ఛత్రపతి శివాజీని కించ పరచలేదు.. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి స్పష్టీకరణ

Makthal: ఛత్రపతి శివాజీని కించ పరచలేదు.. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి స్పష్టీకరణ

మక్తల్ రూరల్: హిందూ సామ్రాజ్య స్థాపనకు కృషి చేసిన ఛత్రపతి శివాజీని తాను కించపరచే విధంగా మాట్లాడలేదని అన్నారు. ఒక వేళ తాను మ ట దొర్లినట్లు భావిస్తే క్షమించాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ

ఈ నెల 21న స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశం సందర్భంగా ఛత్రపతి శివాజీ ఫొటోతో పాటు ఇతరు ల ఫొటోలు పెట్టారని, కానీ సీఎం కేసీఆర్, తెలంగాణ సాధన కోసం కృషి చేసిన ప్రొపెసర్ దివంగత జయశంకర్ సారు ఫొటో లు ఎందుకు పెట్టలేదని కమిషనర్‌ను ప్రశ్నించానన్నారు. ఈ క్రమంలో ఛత్రపతి శివాజీని గురించి తాను తప్పుగా మాట్లాడ లేదని అన్నారు.

- Advertisement -

16వ శతాబ్దంలో హైందవ జాతి అభ్యున్నతి కోసం పోరాడిన గొప్ప వ్యక్తి, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన గొప్ప దార్శనీకుడు శివాజీ అని అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే తనకు ఎంతో గౌరవమని ఆయన తెలిపారు. కానీ బీజేపీ నాయకులు తన మాటలను తప్పుగా అర్థం చేసుకుని తనపై దుష్ప్రచారం చేయండం శోచనీయని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు.

జాతిపిత మహాత్మగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ, భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాన మం త్రి నరేంద్ర మోడీ ఫోటోలు కార్యాలయంలో పెట్టి నప్పుడు తనకు ఏలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన సీఎం కేసీఆర్, ప్రొ. జయశంకర్ సార్‌ల ఫోటోలు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించానన్నారు. ఇప్పటికైనా మునిసిపాలిటీ ఆఫీస్‌లో సీఎం, ప్రొపెసర్ జయంశంకర్‌ల ఫొఫోటోలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

ప్రత్యేక తెలంగాణ బిల్లు కోసం పార్లమెంట్‌లో సహాకరించిన సుష్మాస్వరాజ్‌ను బీజేపీ నేతలు మరిచిపోయారని, కాని టీఆర్‌ ఎస్ పార్టీ ఎప్పుడూ గౌరవిస్తూనే ఉందన్నారు. స్థానిక బీజేపీ నాయకులు తన వ్యక్తిత్వంపై విమర్శలు చేస్తే సహించేది లేద న్నారు. నియోజకవర్గంలో ఆయా గ్రామాల్లో దేశ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేస్తే తాను ఎక్కడైనా వ్యతిరేకించానా? అని ఆయన ప్రశ్నించారు. ఆత్మకూర్ పట్టణంలో ఉట్కూర్ మండలం బిజ్వార్ మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహాలు ఏర్పాటు చేయడానికి పూర్తిగా సహాకరించానని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

చైర్ పర్సన్‌ను కించ పర్చలేదు.
మక్తల్ మున్సిపల్ చైర్ పర్సన్ బాల్చేడ్ పావనిని తాను కించ పరిచే విధంగా మాట్లాడలేదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మో హన్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 21న స్థానిక మునిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో లంచాలు తీసుకుని పనులు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న అధికారుల వైఖరిని నిలదీసే క్రమంలో చిన్న పదం పొరపాటుగా దొర్లిందన్నారు. ఒక వేళ తప్పుగా భావిస్తే అందుకు క్షింతిస్తున్నానని, క్షమాపణ చెప్పడానికైనా సిద్దమేనని ఎమ్మెల్యే చిట్టెం స్పష్టం చేశారు.


మహిళలను, మహిళా ప్రతినిధులను ఎప్పుడూ గౌరవిస్తానన్నారు. సమావేశంలో మక్తల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్‌ గౌడ్, టీఆర్‌ఎస్ నాయకుడు శ్రీనివాస్‌గుప్తా, టీఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు అమరేం దర్‌రెడ్డి, మీడియా కన్వీనర్ నేతాజీరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ సాలమ్, మైనార్టీ నాయకులు అన్వర్ పాషా, హుసేన్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement