e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home జిల్లాలు జీవన ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన

జీవన ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన

మల్దకల్‌, జూలై 29 : మండలంలోని బూడిదపాడు గ్రామంలో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు జీవన ఎరువుల వాడకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డీఏవో గోవింద్‌నాయక్‌, ఏడీఏ సక్రియా నాయక్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ రైతులు పంటల్లో రసాయన ఎరువుల తగ్గించి జీవన ఎరువుల వాడకంపై దృష్టి సారించాలన్నారు. జీవన ఎరువుల వాడకం వల్ల భూమిలో ఉన్న భాస్వరాన్ని కరిగించి పంటకు చేరుతుందన్నారు. రసాయనిక ఎరువులు వాడడం వల్ల వచ్చే ఖర్చు కంటే జీవన ఎరువుల తయారీకి తక్కువ ఖర్చు వస్తుందని వివరించారు. అనంతరం గ్రామంలోని రైతు దశరథ్‌ వ్యవసాయ క్షేత్రంలో జీవన ఎరువు తయారీపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ పెద్ద వీరన్న, ఏవో రాజశేఖర్‌, ఏఈవోలు కిశోర్‌, ఖాజా, రాహుల్‌, సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.
వేరుశనగ విలువ ఆధారిత ఉత్పత్తులపై అవగాహన
మద్దెలబండ గ్రామంలో వ్యవసాయ శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వేరుశనగ ఆధారిత ఉత్పత్తులపై సర్పంచ్‌ జయమ్మ నారాయణ ఆధ్వర్యంలో రైతులకు రైతు వేదిక భవనంలో అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డీఏవో గోవింద్‌నాయక్‌ మాట్లాడుతూ మండలంలో 4,150 హెక్టార్లలో వేరుశనగ పంటను రైతు లు సాగు చేశారన్నారు. రైతులు వేరుశనగ నుంచి వేరుశనగ ఆధారిత ఉత్పత్తులను త యారు చేసి అధిక లాభాలను పొందవచ్చాన్నారు. అనంతరం జిల్లా రిసోర్సు పర్సన్‌ ఉదయ్‌ మాట్లాడుతూ ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ వల్ల వేరుశనగ ఆధారిత ఉత్పత్తులు అయిన పల్లి నూనె, గానుగ నూనె, పల్లి పట్టీలు, పల్లీలు, చిరుతిండ్లు తయారీ కోసం ప్రభుత్వం ద్వారా 35శాతం సబ్సిడీతో పథకాలు ఉన్నాయన్నారు. పల్లి, నూనె తయారీ కోసం రూ.7లక్షలు, పల్లి పట్టీలు తయారీ కోసం రూ.12లక్షలు, చిరు తిండ్లు తయారీ కోసం రూ. 8.50 లక్షలు ఇస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని సూ చించారు. కార్యక్రమంలో డీఆర్డీవో ఉమాదేవి, ఏడీఏ సక్రియానాయక్‌, రామ్మూర్తి, వైస్‌ ఎంపీపీ వీరన్న, ఏవో రాజశేఖర్‌, ఏఈవోలు ఖాజా, కిశోర్‌, సర్పంచులు జయమ్మ, తా న్యానాయక్‌, వీరేశ్‌ నాయక్‌ పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana