హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు అల్లు శిరీష్ తహతహలాడుతున్నాడు. తను చేసిన సినిమాలలో ఏ సినిమాకు మంచి ఆదరణ లభించకపోవడంతో ప్రస్తుతం తాను చేస్తున్న ప్రేమ కాదంట సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. రాకేష్ శశి దర్శకత్వంలో ‘ప్రేమ కాదంట’ అనే టైటిల్ తో తేటకెక్కిస్తున్న ఆ సినిమాలో అను అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని అల్లు శిరీష్ ఎంతో నమ్మకంతో కష్టపడుతున్నాడు.
ప్రేమ కాదంట సినిమాకోసం అల్లు శిరీష్ కొద్ది రోజులుగా జిమ్‌లో భారీగా వర్కవుట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటిలాగే వర్కవుట్స్ చేస్తుండగా ఆయన మెడకు గాయం అయినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అతడే ఫొటోతో సహా స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు. “ఇది ఫ్యాషన్ కోసం పెట్టుకుంది కాదు, స్ట్రెంత్ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు నిజంగానే మెడకు దెబ్బ తగిలింది” అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఫొటో షేర్ చేశాడు. శిరీష్‌కు అయిన గాయంపై అభిమానులు ఆందోళన చెందడంతో పాటు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.