గురువారం 25 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 24, 2021 , 00:46:26

సల్లంగా దీవించు.. ఎల్లమ్మ తల్లీ

సల్లంగా దీవించు.. ఎల్లమ్మ తల్లీ

  • బోనాలతో తరలివచ్చిన మహిళలు
  • ఆలయం చుట్టూ భక్తుల ప్రదక్షిణలు
  • మొక్కులు చెల్లించుకున్న భక్తులు 

ఊట్కూర్‌, ఫిబ్రవరి 23 : గ్రామ దేవత రేణుకాఎల్లమ్మ జాతర వేడుకలు మంగళవారం మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. ఎల్ల మ్మ దేవత ఉత్సవాలను పురస్కరించుకుని మహిళలు ఉదయాన్నే ఇండ్లను శుభ్రం చేసుకున్నారు. ఆలయ ధర్మకర్త పె ద్దింటి శంకర్‌గౌడ్‌ ఇంటి నుంచి భక్తులు పెద్ద బోనంతో ఆల యం వద్దకు మేళతాళాలతో ఊరేగింపుగా చేరుకున్నారు. ఆయా గ్రామాల్లో దేవతలను దర్శించుకునేందుకు భక్తులు బోనాలు ఎత్తుకున్నారు. అన్నం, పచ్చిపులుసు, ఈత కల్లు నైవేద్యంతో బోనం ధరించిన భక్తులు ఎల్లమ్మ ఆలయం చు ట్టూ ప్రదక్షిణలు చేశారు. మహిళలు పూనకంతో పరవశించిపోయారు. పలువురు భక్తులు కోళ్లు, మేకలను బలియిచ్చి గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఇంటిల్లి పాదితో కలిసి జాతర ప్రాంగణంలోనే భోజనాలను ఆరగించారు. అమ్మవారి విగ్రహాన్ని నగలు, పట్టు వస్ర్తాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  సర్పంచ్‌లు సూర్యప్రకాశ్‌రెడ్డి, సావిత్రమ్మ ఆధ్వర్యంలో భక్తులకు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ పూజారులు పాల్గొన్నారు.

ఘనంగా ఎల్లమ్మ ఉత్సవాలు

నారాయణపేట టౌన్‌, ఫిబ్రవరి 23 : పట్టణంలోని సింగార్‌బేస్‌లో ఉన్న ఎల్లమ్మ ఆలయంలో ఉత్సవాలను ఘనంగా జరుపుకొన్నారు. ఆలయం లో అమ్మవారి విగ్రహానికి ప్రత్యేకంగా అలంకరించి, మహా మంగళహారతి త దితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు ఉపవాస దీక్షలను నిర్వహించి అమ్మవారికి మేకలు, కోళ్లు బలియిచ్చి, కల్లు, వేప మండలాలు, అ న్నం, తీపి వంటకాలతో నైవేద్యాలు స మర్పించి మొక్కులు చెల్లించుకున్నా రు. పలువురు భక్తులు ఆలయం వద్దే వంటకాలను చేసి ఆరగించారు. ఇంకా నాలుగు మంగళవారాలపాటు ఉత్సవాలను నిర్వహించనున్నారు. 

ఆలయానికి పోటెత్తిన భక్తజనం 

నారాయణపేట రూరల్‌, ఫిబ్రవరి 23 : మండలంలో నిర్వహించిన ఎల్లమ్మ దేవత ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు. మండలంలోని లింగంపల్లి ఎల్లమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైయ్యాయి. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. అనంతరం పెద్ద బోనం తో ఆలయం వద్దకు మేళతాళాలతో ఊరేగింపుగా చేరుకున్నారు. ఊరేగింపు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బాలయ్య, ఉప సర్పంచ్‌ రాములు, ఆలయ ధర్మక్తలు, అర్చకులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.  జాతరలో ఎలాంటి సంఘటనలు చో టు చేసుకోకుండా ఎస్సై చంద్రమోహన్‌ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి అమ్మవారిని దర్శించుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఎ మ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేసి సన్మానించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతర ప్రాంగణంలో ప్ర తిఒక్కరూ మాస్కులు విధిగా ధరించి భౌతిక దూరం పా టించాలని భక్తులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ కో ఆప్షన్‌ తాజొద్దీన్‌, ఎంపీటీసీ దామోదర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

VIDEOS

logo