లక్ష్యానికి మించి సభ్యత్వ నమోదు చేపట్టాలి

- ప్రతి కార్యకర్తకూ టీఆర్ఎస్ అండ
- జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి
మరికల్, ఫిబ్రవరి 23 : ప్రతి కార్యకర్త ఉద్యమ స్ఫూ ర్తితో లక్ష్యానికి మించి సభ్యత్వ నమోదు చేపట్టాలని జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి అన్నారు. మండలంలోని ఎలిగండ్లలో మంగళవారం సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభు త్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రజ లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభ్యత్వాలను స్వీకరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో నాయకులు తిరుపతయ్య, శ్రీనివాసులు, మతిన్, మోహన్, హన్మంతు, ప్ర కాశ్, రాములు, ఎల్లప్ప, బ్రహ్మానందరెడ్డి, చిన్న భీంరెడ్డి, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలదే..
మార్కెట్ కమిటీ మండల డైరెక్టర్ జగదీశ్, పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మండలంలో సభ్యత్వ న మోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి బలమని, పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత వారిదేనన్నారు. కార్యకర్తల భద్రతకు పా ర్టీ అండగా ఉంటుందన్నారు. ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదును పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. సభ్యత్వ న మోదులో కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు. స భ్యత్వం పొందిన ప్రతి సభ్యుడికి ప్రమాద బీమా ద్వారా రూ.2లక్షల ఆర్థిక సాయం లభిస్తుందన్నారు. కార్యక్రమం లో నాయకులు సత్యనారాయణ, లింగప్ప, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
‘ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటాం’
కోస్గి, ఫిబ్రవరి 23 : ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటామని, కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభ్యత్వాలు తీసుకోవాలని మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ అన్నపూర్ణ అన్నారు. మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులో క్రియాశీలక సభ్యత్వ నమోదు చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సభ్యత్వం కలిగి ఉన్న ప్రతి కార్యకర్తకూ ప్ర మాద బీమా సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు. కార్యకర్తలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానన్నారు. మండలంలోని నాచారం, తొగాపూర్ గ్రామాల్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి సభ్యత్వాలు చేయించారు. కార్యక్రమంలో నాయకులు, కా ర్యకర్తలు పాల్గొన్నారు.
‘కార్యకర్తలకు అన్యాయం జరుగనీయం’
ధన్వాడ, ఫిబ్రవరి 23 : గ్రామాల్లో ఉన్న టీఆర్ఎస్ కా ర్యకర్తలకు అన్యాయం జరుగకుండా పని చేస్తానని ఎమ్మె ల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని సర్పంచ్ స్వగృహంలో మండల స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ పార్టీకి కార్యకర్తలే బలమని, కార్యకర్తల కోసం ఏ పనై నా చేయడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ప్రభు త్వం చేపడుతున్న పథకాలను చూసి చాలా మంది సభ్యత్వాలను తీసుకోవడానికి ముందుకొస్తున్నారన్నారు. గ్రా మాల్లో సభ్యత్వాలు చేయించడానికి కార్యకర్తలు సిద్ధం కా వాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే నాయకులకు సభ్యత్వాలను అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ సురేఖారెడ్డి, సర్పంచ్ అమరేందర్‌రెడ్డి, సింగిల్విం డో చైర్మన్ వెంకట్రామ్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, ఎంపీటీసీ సుధీర్‌కుమార్, రాంకిష్టయ్యపల్లి సర్పంచ్ మాధవరెడ్డి, గోటూర్ సర్పంచ్ నారాయణరెడ్డి, బుడ్డమర్రితండా సర్పంచ్ పూర్యానాయక్, మడిగేలముల్లయ్య తండా సర్పంచ్ హున్యానాయక్, నాయకులు, కా ర్యకర్తలు పాల్గొన్నారు.
ఉత్సాహంగా సభ్యత్వ నమోదు
ఊట్కూర్, ఫిబ్రవరి 23 : మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఉత్సాహంగా సాగుతున్నది. మండలం లోని మల్లేపల్లి, వల్లంపల్లి, అమీన్పూర్, కొల్లూరు గ్రామా ల్లో నాయకుల ఆధ్వర్యంలో సభ్యత్వం చేయించారు. ప్ర భుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించా రు. ఆయా గ్రామాల్లో సర్పంచ్‌లు, రైతు బంధు కమిటీ గ్రా మాధ్యక్షుడు శేఖర్, ఉపసర్పంచ్ రాజు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
దామరగిద్ద మండలంలో...
దామరగిద్ద, ఫిబ్రవరి 23 : మండలంలో సభ్యత్వ న మోదు కార్యక్రమాన్ని ఎంపీపీ బక్క నర్సప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఎక్కువ మొత్తంలో స భ్యత్వ నమోదు చేయించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మాణిక్యప్ప, నాయకులు పాల్గొన్నారు.
గుడిగండ్లలో...
మక్తల్ రూరల్, ఫిబ్రవరి 23 : మండలంలోని గుడిగండ్లలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ గ్రామ అధ్యక్షుడు తిరుపతయ్య మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై స్వచ్ఛందంగా సభ్యత్వాన్ని తీసుకోవడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ వంటి పథకాల వల్ల రైతు లు లబ్ధిపొందారన్నారు. కార్యక్రమంలో పార్టీ గ్రామ ప్రధా న కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, మాజీ సర్పంచ్ హన్మంతు, నాయకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- మహిళ ఫిర్యాదుతో ఆప్ ఎమ్మెల్యేపై వేధింపుల కేసు
- సచిన్ ముందే చూడకుండా రుబిక్ క్యూబ్‌ని సెట్ చేశాడు..వీడియో వైరల్
- ‘4-5 రోజుల తర్వాత మరణిస్తే టీకాతో సంబంధం లేనట్లే..’
- ఝరాసంగం కేజీబీవీలో కరోనా కలకలం
- బీపీసీఎల్ ఫర్ సేల్: నుమలీగఢ్ రిఫైనరీతో షురూ..!
- నెట్‌ఫ్లిక్స్ డీల్ కు నో..కారణం చెప్పిన నాగార్జున
- గల్వాన్‌లో మనపై దాడిచేసిన చైనా కమాండర్‌కు అత్యున్నత పదవి
- మోదీ స్టేడియంలో కోహ్లీసేన ప్రాక్టీస్: వీడియో
- ఆ టీ ధర ఎంతో తెలిస్తే షాకవుతారు
- జన్నేపల్లి శివాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు