ఆదివారం 07 మార్చి 2021
Narayanpet - Feb 23, 2021 , 00:39:05

ముమ్మరంగా సభ్యత్వ నమోదు

ముమ్మరంగా సభ్యత్వ నమోదు

కోస్గి, ఫిబ్రవరి 22 : మండలంలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని మీర్జాపూర్‌లో సోమవారం సభ్యత్వ నమో దు కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో క్రియాశీల సభ్యత్వాలు చేపట్టినట్లు తెలిపారు. పీఏసీసీఎస్‌ చైర్మన్‌ భీంరెడ్డి, జెడ్పీటీసీ ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో సారంగరావ్‌పల్లి, ముశ్రిఫాలో ఎంపీటీసీ పోశప్ప ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రమేశ్‌తోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

కొల్లూరులో ...

ఊట్కూర్‌, ఫిబ్రవరి 22 : టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఊరురా ఉద్యమంలా సాగుతున్నాయి. మండలంలోని కొల్లూరులో టీఆర్‌ఎస్‌ గ్రామాధ్యక్షుడు గోవిందరాజు ఆధ్వర్యంలో నాయకులు, కా ర్యకర్తలు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించా రు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకు లు గోపాల్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, భీంరెడ్డి, గడ్డం మల్లప్ప పాల్గొన్నారు.

పేదల పక్షపాతి సీఎం కేసీఆర్‌

నారాయణపేట టౌన్‌, ఫిబ్రవరి 22 : పేదల పక్షపాతి సీఎం కేసీఆర్‌ అని టీఆర్‌ఎస్‌ నాయకుడు జొన్నల సుభాష్‌ అన్నారు. పట్టణంలోని 2వ వార్డులో క్రియాశీల, సాధారణ సభ్యత్వాల నమోదు కార్యక్రమం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం చెందేందుకు వార్డులోని ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఇంటింటికీ తిరిగి సభ్యత్వాలు చేయించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ వినోద్‌, వార్డు అధ్యక్షుడు దేవరాజ్‌, నాయకులు సత్తిరెడ్డి, బసిరెడ్డి పాల్గొన్నారు. 


VIDEOS

logo