బుధవారం 24 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 22, 2021 , 00:35:10

రెండు లారీలు ఢీ... డ్రైవర్‌ మృతి

రెండు లారీలు ఢీ... డ్రైవర్‌ మృతి

మరికల్‌, ఫిబ్రవరి 21 : రెండు లారీలు ఢీ కొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పస్పుల గ్రామ సమీపంలో ఆదివారం చోటుచేసుకున్నది. ఎస్సై రా ఘవేందర్‌ కథనం ప్రకారం... హైదరాబాద్‌ నుంచి రాయిచూర్‌కు వెళ్తున్న లారీ, మక్తల్‌ నుంచి మహబూబ్‌నగర్‌కు వెళ్తున్న లారీ పస్పుల గ్రామ సమీపంలో ఎదురెదురుగా ఢీ కొనడంతో రాయిచూర్‌కు వెళ్తున్న లారీ డ్రైవర్‌ కోటేశ్‌ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్‌ కోటేశ్‌ బెల్లీపకాల గ్రామం, మల్లేపల్లి మండలం దేవరకొండకు చెందిన వ్యక్తి గా పోలీసులు గుర్తించారు. రోడ్డుపై లారీ బోల్తా పడడంతో మరో డ్రైవర్‌ బాలుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే మరికల్‌ సీఐ శివకుమార్‌ సం ఘటన ప్రదేశానికి చేరుకొని జేసీబీతో లారీలను పక్కకు తీసివేయడంతో ట్రాఫిక్‌ సమస్య తీరింది.  కోటేశ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభు త్వ దవాఖానకు తరలించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


VIDEOS

logo