మాతృభాషను రక్షించుకోవాలి

నారాయణపేట, ఫిబ్రవరి 21 : రాబోయే 30 ఏండ్లల్లో తెలుగు కనుమరుగవుతుందని యునె స్కో హెచ్చరికలను సవాల్‌గా తీసుకొని మాతృభాషను రక్షించుకోవాలని కవి తాటి నర్సప్ప అన్నా రు. మాతృభాష దినోత్సవం సందర్భంగా శక్తిపీ ఠం అనుబంధ సంస్థ హిందూ రచయితల సం ఘం, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ వా రు సంయుక్తంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ ఉ త్తర ప్రత్యుత్తరాలు తెలుగులో రావాలని తెలిపా రు. శక్తిపీఠం వ్యవస్థాపకుడు శాంతానంద్ పురోహిత్ మాట్లాడుతూ మాతృభాష రక్షణతోనే మన భవిష్యత్ ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. ము ఖ్య అతిథి కుర్మన్న మాట్లాడుతూ తెలుగు భాష వికాసంపై వివరించారు. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ అధ్యక్షుడు రాములు మాట్లాడు తూ భాష పండితుల ఖాళీలు భర్తీ చేసి నాణ్యమైన భాష జ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలని కోరా రు. మాతృభాష ఔన్నత్యాన్ని, ప్రాధాన్యతను కవు లు కలం, గళంతో చాటారని గుర్తు చేశారు. కార్యక్రమంలో దత్తు, మంగళ, నర్సింహులు, తాటికృ ష్ణ, శ్రీనివాస్, రాఘవేంద్రగౌడ్, ప్రతాప్‌రెడ్డి, రవి పాల్గొన్నారు.
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
ఊట్కూర్, ఫిబ్రవరి 21 : ప్రపంచ మాతృభాష దినోత్సవ వేడుకలను మండలంలోని పులిమామిడి జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. చదువులతల్లి సరస్వతీ మాత చిత్రపటానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొ ని పూజలు నిర్వహించారు. తెలుగు అధ్యాపకుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో విద్యార్థులకు తెలుగుభాష ప్రాముఖ్యతపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. మాతృభాష ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. వ్యాసరచనలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- విద్యార్థులు లక్ష్యాలను సాధించాలి
- వైరల్ వీడియో : ఆవు క్యాట్ వాక్
- ఆటోపైనే ఇళ్లు.. ఆనంద్ మహీంద్రా ఫిదా..!
- ఏపీలో కొత్తగా 117 కరోనా కేసులు
- సెంచరీతో సెలక్టర్లను ఆకర్శించిన దేవ్‌దత్
- దేవ్రీ ఆలయంలో పూజలు చేసిన ధోనీ
- సందీప్ కిషన్ నా ఫోన్ కాల్ ఎత్తాలంటే భయపడ్డాడు
- చిన్నారుల విద్యకు సోనూ సూద్‌తో చేతులు కలిపిన ఎంఐ మొబైల్స్
- మొలకలు ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది
- బౌద్ధమతం ప్రపంచ శాంతికి ప్రతీక