శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 22, 2021 , 00:34:54

సాగులో అ టెన్షన్

సాగులో అ టెన్షన్

  • యాజమాన్య చర్యలతో పంటను కాపాడాలి
  • జిల్లాలో వరి సాగు విస్తీర్ణం 96వేల ఎకరాలు
  • పంటలకు ఎర్రబడడం, అగ్గి తెగులు వ్యాప్తి
  • అ జాగ్రత్తతో పంట నష్టపోయే ప్రమాదం
  • అధికారుల సూచనలు పాటించాలి

నారాయణపేట టౌన్‌, ఫిబ్రవరి 21 : జిల్లాలో ప్రస్తుతం వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా వరి పంట ఎర్రబడడం, అగ్గి తెగులు వ్యాస్తున్నది. వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ యాజమాన్య పద్ధతులను పా టించడంతో పంటలను కాపాడుకోవచ్చని వ్యవసాయ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. పంట ఎర్రబడిందా, అగ్గి తెగులు వ్యాప్తించిందా అని తెలుసుకొని వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు మందులు వాడాలని తెలియజేస్తున్నారు. అలా కాకుండా నేరుగా ఫర్టిలైజర్‌ షా పులను సంప్రదించి మందులు వాడినైట్లెతే పంట నష్టపో యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 

అయితే కొన్ని రోజుల నుంచి వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకున్నాయి. పగలు ఎండగా ఉండ డం, రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరుగుతున్నది. దీంతో జిల్లాలోని కొన్ని మండలాల్లో వరి పంట ఎర్రబడ డం, కొన్ని మండలాల్లో అగ్గి తెగులు వ్యాపించింది. ఇలాం టి పరిస్థితుల్లో రైతులు పురుగు, తెగులు మందులను పిచికారీ చే యడం వల్ల సాగు ఖర్చు పెరుగుతుందే తప్ప ఎలాంటి ప్ర యోజనం కలుగదని అధికారులు తెలుపుతున్నారు. 

రెండు మండలాల్లో అగ్గి తెగులు వ్యాప్తి...

యాసంగిలో జిల్లాలోని 11 మండలాల్లో మొత్తం 96 వేల ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేశారు. జిల్లాలోని కోస్గి మండలంలో 8,290 ఎకరాల విస్తీర్ణం, మద్దూ ర్‌ మండలంలో 8,951 ఎకరాల విస్తీర్ణంలో వరి పంట వే శారు. అయితే ఈ రెండు మండలాల్లో వరి పైర్లకు అగ్గి తెగు లు వ్యాపించింది. మిగతా 9 మండలాల్లో పంట పూర్తి గా ఎర్రబడిన లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో వ్యవసా య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి రైతులకు తగిన సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. ఆయా గ్రామాల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి కారణాలు వివరించడం, పంట నష్టపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వేయాల్సిన మందుల గూర్చి తెలియజేస్తున్నారు.   

వరి పైరు ఎర్రబడడం...

కొన్ని రోజులుగా వాతావరణంలో ఏర్పడిన ఉష్ణాగ్రతల కారణంగా వరి పంటకు భూమిలోని పోషకాలు అం దక ఆకులు ఎరుపు రంగులోకి మారి తర్వాత ఎండిపోతున్నాయి. రాత్రి ఉ ష్ణాగ్రతల వల్ల పైర్లు ఎదుగకుండా పోతున్నా యి. ఈ సమస్య కొన్ని రోజులు మాత్రమే ఉంటుందని, రాత్రి ఉష్ణాగ్రతలు కొంచెం పెరిగినైట్లెతే వరి పైర్లు సాధారణ స్థితికి వస్తాయని అధికారులు చెబుతున్నారు. పొలంలో సాయంత్రం వేళల్లో నీరు పెట్టి ఉదయం తీసి వేయాలని, మళ్లీ కొత్త నీరు పెట్టాలని అధికారులు సూచిస్తున్నారు. 

సస్యరక్షణ చర్యలు...

వరి పంట ఎర్రబడిన లక్షణాలు కనిపిస్తే పొలంలో ఇంతకు ముందే పొటాష్‌ వేయని పక్షంలో యూరియాతోపాటు రెండో దఫాగా మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ 15-20 కిలోలు వేయాలి. చవుడు ఎక్కువగా ఉన్న పొలాల్లో జింక్‌ ధాతు లోపం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక లీటరు నీటిలో 2గ్రాముల జింక్‌ సల్ఫేట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. అదేవిధంగా ఒక లీటరు నీటికి 19ః 19ః19 పోషకాన్ని 10గ్రాములు, కార్భండాజిమ్‌, మ్యాం కోజెట్‌ 2.5గ్రాములు కలిపి పిచికారీ చేయాలని అధికారులు చెబుతున్నారు. 

అగ్గి తెగులు వ్యాప్తి, కారణాలు...

చలి తీవ్రత కారణంగా అగ్గి తెగులు వ్యాపించిన పైరు ఆకులపై నూలుకండే ఆకారపు మచ్చలు ఏర్పడి, చివర్లు మొనదేలి అంచులు మాత్రం ముదురు గోదుమ రంగులో, మధ్య భాగం బూడిద రంగులో ఉంటాయి. ఈ మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి మొక్కలు ఎండిపోయి, పంట తగులబడినట్లుగా కనిపిస్తున్నది. రాత్రి ఉష్ణాగ్రతల్లో తగ్గుదల గాలిలో అధిక తేమ శాతం ఉండడం వల్ల అగ్గి తెగులు రావడానికి ప్రధాన కారణం. అయితే వరి పైర్లు సరిగ్గా ఎదుగడం లేదని అధిక మొత్తంలో నత్రజని వేసినట్లయితే అగ్గి తెగులు వ్యాప్తి ఉధృతి పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. 

నివారణ చర్యలు...

అగ్గి తెగులును ఆకుపచ్చ దశలోనే గుర్తించాలి, లేకపోతే మెడవిరుపు ఆశించి పంటకు అధిక నష్టం వాటిల్లుతున్నది. వరి పైరు చిరుపొట్ట దశలో అగ్గి తెగులు లక్షణాలు కనిపించినైట్లెతే ఆఖరి దఫా నత్రజని ఎరువును వేయడాన్ని కొన్ని రోజుల పాటు తాత్కాలికంగా ఆపాలని అధికారులు తెలిపారు. మొక్కల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందిచడానికి పొటాష్‌ ఎరువును మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ రూపంలో ఎకరానికి 15 కిలోల చొప్పున వేయాలి.

తెగులు ఉధృతి తొలిదశలో ఉన్న సమయంలో ఒక లీటరు నీటికి ఐసోప్రోథమోలిన్‌ 1.5 మి.లీ/లీ, కాసుగామైసిన్‌ 2.5 మి.లీ/లీ, ట్రైసైక్లోజోల్‌ను 2.5 గ్రాముల మ్యాంకోజెబ్‌తో కలిపి 5 నుంచి 7 రోజులపాటు పిచికారీ చేయాలి. అగ్గి తెగులు ఉధృతి అధికంగా ఉన్నైట్లెతే పికాక్సిస్టోబిన్‌ 6.78శాతం, ప్రొపికొనజోల్‌ 20.33శాతం, ఎస్‌సీ 2 మి.లీ/లీ మిశ్రమంగా చేసి, ప్రొపికొనజోల్‌ 10.7శాతం, ట్రైపైక్లోజోల్‌ 34.2శాతం, ఎస్‌ఇ 1 మి.లీ మిశ్రమంగా చేసి, టెబుకొనజోల్‌, ట్రైప్లాక్సిస్టోబిన్‌ 0.4 గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కొత్త మిశ్రమ శిలీంధ్ర నాశినులను పిచికారీ చేసే సమయంలో ఇతర పురుగు మందులు, పోషకాలను కలుపరాదని అధికారులు తెలిపారు. అగ్గి తెగులు లక్షణాలు కనిపించినప్పుడు పొలాన్ని ఆరబెట్టాలని, వరి పైరు నీటి ఎద్దడికి గురైనైట్లెతే తెగులు ఉధృతి పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. 

అధికారుల సూచనలు పాటించాలి

ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల వల్ల వరి పంటకు ఏర్పడుతున్న ఎర్రబడడం, అగ్గి తెగులు నివారణకు అధికారులు అందించే సూచనలు పాటించాలి. ఆయా మండలాల్లో రైతులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పంట నష్ట నివారణ చర్యలు చేపడుతున్నాం. తెగుళ్లు కనబడడం, ఎర్రబడడం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే అధికారులకు సమాచారం అందించాలి. తగిన జాగ్రత్తలు పా టించడంతో పంటను కాపాడుకోవచ్చు.

- జాన్‌ సుధాకర్‌ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, నారాయణపేట

క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలిస్తున్నాం

మండలంలో వరి పైర్లు ఎర్రబడే లక్షణాలు కనిపిస్తున్నాయి. అభంగాపూర్‌, కోటకొండ, ఎక్లాస్‌పూర్‌, అప్పిరెడ్డిపల్లి గ్రామాల్లో ఎక్కువగా ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించి రైతులకు సూచనలు, సలహాలు ఇస్తున్నాం. రాత్రి వేళల్లో పంట పొలాల్లో నీరు ఎక్కువగా ఉంచకూడదు. మరుసటి రోజూ నీటిని మార్చాలి.

- నాగరాజు ఏవో, -నారాయణపేట    


VIDEOS

logo