సోమవారం 08 మార్చి 2021
Narayanpet - Feb 21, 2021 , 00:27:12

క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే

క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే

నారాయణపేట, ఫిబ్రవరి 20 : దామరగిద్ద మండలం బాపన్‌పల్లిలో జరిగిన విద్యుత్‌ షాక్‌ ప్రమాదంలో గాయపడి మహబూబ్‌నగర్‌ జిల్లా దవాఖానతోపాటు, పట్టణంలోని జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులను శనివా రం ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి పరామర్శించా రు. మహబూబ్‌నగర్‌ దవాఖానలో చికిత్స పొం దుతున్న క్షతగాత్రులు వెంకటయ్య, పెద్ద పాం డులను, పేట దవాఖానలో చికిత్స పొందుతు న్న  క్షతగాత్రులు అంబరేశ్‌, శ్రీనివాస్‌, శివరాజ్‌, శివకుమార్‌, గోవింద్‌లతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడవద్దని, తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ భాస్కరకుమారి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ హరినారాయణ భట్టడ్‌, పేట, దామరగిద్ద ఎంపీపీలు, జెడ్పీటీసీ అంజలి, దామరగిద్ద పీఏసీసీఎస్‌ చైర్మన్‌ ఈదప్ప, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు రాజవర్ధన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. 

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం...

దామరగిద్ద, ఫిబ్రవరి 20 : బాపన్‌పల్లిలో శుక్రవారం రాత్రి జరిగిన వి ద్యుత్‌ షాక్‌తో మరణించి న వారి పార్థివ దేహాలకు పూలమాల వేసి, కుటుం బ సభ్యులను ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వ పరంగా వారి కుటంబాలను ఆదుకుంటామని వారికి భరో సా కల్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ బక్క నర్సప్ప, మాజీ ఎంపీపీ వెంకట్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

ఉందేకోడ్‌ గ్రామంలో...

నర్వ, ఫిబ్రవరి 20 : మండలంలోని ఉందేకోడ్‌ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ భర్త టీఆర్‌ఎస్‌ నాయకుడు శేఖర్‌ (42) శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు శేఖర్‌ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి శేఖర్‌ భౌతికాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ జయరాములుశెట్టి, విండో చైర్మన్‌ బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ లక్ష్మణ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు వి.మహేశ్వర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

VIDEOS

logo